మాఘశుద్ధ పంచమినే 'వసంత పంచమి' అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమి తేది 16-2-2021 మంగళవారం నాడు జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది.
వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఆరోజున సరస్వతి దేవి ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది. శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి… అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి.
Comments
Post a Comment