సుదర్శనం అనే పదం రెండు పదాల కలయిక. 'సు' అంటే పవిత్రం, 'దర్శనం' అంటే చూడటం. ఈ పదాల కలయికకు అర్థం పవిత్ర దర్శనం.
సుదర్శన చక్రం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రాన్ని వేదాల కాలం నుండి పవిత్ర ఆయు ధంగా భావి స్తారు. శ్రీవైష్ణవ మత సంప్రదాయం ప్రకారం శ్రీమహా విష్ణువు చేతిలో ఉండే చక్రం చెడును నాశనం చేసి, ఆపదలో ఉన్న వారికి రక్షణనిచ్చే ఆయుధం. ప్రజలు తమ సుఖ సంతోషాల కోసం ఇంటిలో కాని, గుడిలోకాని సుదర్శన హోమాన్ని నిర్వహిస్తారు. ఈ హోమంలో భాగంగా సుదర్శనుని, అతడి భార్య విజయవల్లిని పవిత్ర జలం ఉన్న కుండలోకి ఆహ్వానిస్తూ పూజ చేస్తారు. సుదర్శనుని స్తుతిస్తూ మంత్రాలు పఠి స్తారు. ఈ హోమం పూర్తయ్యే సరికి హోమకర్త సుఖ సంతోషాలతో, ఆరోగ్యం తో తుల తూగుతాడని విశ్వాసం.శ్రీమహావిష్ణువుకు మంచి రోజు లైన బుధవారం, శనివారం వచ్చిన ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులు ఈ హోమం చేయడానికి అను కూలం. నియమ నిష్టలతో ఈ హోమాన్ని చేయాలి. మంత్రాలు చక్కని ఉచ్ఛారణతో పల కాలి. శరీరం, మనసు, మనం చేసే పనులు శుద్ధంగా ఉండాలి.
హోమం ఫలితాలు - చెడును నాశనం చేయడం, పాపాలను నిర్మూలించడం, ఆరోగ్యాన్ని పెంపొందించడం, మానసిక స్థయిర్యాన్ని ఇవ్వడం.
Comments
Post a Comment