ప్రతి నెలలోను వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఈ నెలలో 10-2-2021 బుధవారం నాడు మాస శివరాత్రి వస్తుంది. శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి.
శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివే దన చేయాలి.అభిషేకం ఉదయం 6 గంటలకు శ్రీ రామ లింగేశ్వర ఆలయం, మయూరిమార్గ, బేగంపేట, హైదరాబాద్ లో ప్రారంభ0 అవుతుంది.
Comments
Post a Comment