చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి , దీనినే 'దమన ఏకాదశి' అని పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలూ చెబుతున్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
“ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్” – ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. ఉపవాసంనాడు – ఉపవాసః స విఙ్ఞేయః సర్వభోగ వివర్జితః” – పాపకృత్యాలకు దూరంగా ఉండి , సకల భోగాలను వదలి, పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట! ఇంద్రియ ప్రకోపాన్ని అణచి, 11 ఇంద్రియాలను (పంచ కర్మేంద్రియ, పంచ ఙ్ఞానేంద్రియ మనస్సులు 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపజేసేదే నిజమైన ఉపవాసం. ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు!
ఈ ఏకాదశి రోజున ము త్తైదువలు శ్రీ లక్ష్మీ నారాయణు లను పూజించి ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజున అతిధి కి బోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమించాలి. దేవుని అనుగ్రహం తప్పకుండా పొందుతారు. కోరికలు నెరవేరుతాయి.
Comments
Post a Comment