శ్రీమన్నారాయణుడు తన వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు.
దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట.ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి, బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి.శ్రీక్రిష్ణుడు యుధిష్టర రాజుకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు. వరూధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడు.వరూధిని ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి హారం అర్పించాలి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి.. ఎర్రని ధాన్యాలను తినకూడదు మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు మెటల్ ప్లేట్ లో ఆహారం తినవద్దు తేనే తినకూడదు ఆహారం ఒక్కసారి మాత్రమే చేయాలి.
Comments
Post a Comment