శని అమావాస్య పరిహారాలు
- శని అమావాస్య రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల నూనె , నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
- ఏలినాటి శని,అష్టమ శని, అర్థాష్టమ శని దోషం తగ్గించుకునేందుకు ఆలయాల్లో శనికి నువ్వుల నూనె, నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించాలి
- ఈ రోజున పితృ తర్పణం, నదులు-సరస్సుల్లో స్నానం చేసి దానధర్మాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు
- శ్రమ జీవులైన చీమలకు ఆహారం వేయడం, పశువులు పక్షల దాహం తీర్చడం లాంటివి చేస్తే ఇంకా మంచిది
- కనీసం తలకి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకుని శనిస్త్రోత్రాలు చదువుకున్నా కొంతవరకూ గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
- అన్నింటికన్నాశని జపం ఉదయం 6 గంటలకు చేయాలి . విష్ణు సహస్రనామ పారాయణం మరియు హనుమాన్ చాలీసా పఠిస్తే అన్నిరకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు
Comments
Post a Comment