ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ( Rishi Panchami 2022) ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. పంచాంగం ప్రకారం, ఋషి పంచమి సెప్టెంబర్ 1, గురువారం వస్తుంది. ఋషి పంచమినే రిషి పంచమి , గురు పంచమి అని కూడా అంటారు . సనాతన ధర్మంలో ఋషి పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏడుగురు ఋషులను పూజిస్తారు. ఈ రోజున ఎవరైతే ఋషులను పూజించి స్మరిస్తారో వారికి పాప విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ పుణ్య రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులను ఒక్కసారైనా వారిని తలచుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. అరణ్యవాసంలో సీతారాములకు అభయం ఇచ్చినవారు అత్రిమహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపించినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రాముడికి తన తపః ఫలాన్ని అందించిన మహారుషి గౌతముడు. రాముడి గురువు విశ్వామిత్రుడు, కులగురువు వశిష్ఠు...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com