Skip to main content

Posts

Showing posts from February, 2021

సంకట హర చవితి 2-3-2021 మంగళవారం

  పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున (2-3-2021 మంగళవారం  )చేసే వ్రతంను  సంకటహర చతుర్థి వ్రతం అంటారు.  శక్త్యానుసారము గరిక పూజను కాని ,  గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును .గణపతి  ఉదయం 7- గంటలకు అభిషేకం తో ప్రారంభo   రాచకొండ  రామా చార్యులు, పూజారి, శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం, మయురిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.

తేది 24-2-2021 బుధవారం

    ఈ రోజున  పునర్వసు నక్షత్రం ఉంది.. మొత్తం 27 నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం.   శ్రీరామచంద్రుడు   పుట్టిన నక్షత్రం .  ఈ రోజు రాములవారికి ఉచ్ఛవ మూర్తులకు ఉదయం 7 గంటలకు  అభిషేకం ఉంటుంది.   పునర్వసు నక్షత్ర వృక్షము   వెదురు . ఈ నక్షత్రం వారు వెదురు వృక్షమును నాటినా, పోషించినా కూడా వారు జీవితములో పైకి వస్తారు. రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్, బేగంపేట్, హైదెరాబాద్

మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు

  మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది.  శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు. పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి. వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది. శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı ఇతర పక్షులు పీకలు పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి. వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి, జంతువులకు, పక్షులకు ఇతర జీవరాసులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగ...

శ్రీ సుధర్శన హోమం ప్రాముఖ్యత

 సుదర్శనం అనే పదం రెండు పదాల కలయిక. 'సు' అంటే పవిత్రం, 'దర్శనం' అంటే చూడటం. ఈ పదాల కలయికకు అర్థం పవిత్ర దర్శనం. సుదర్శన చక్రం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రాన్ని వేదాల కాలం నుండి పవిత్ర ఆయు ధంగా భావి స్తారు. శ్రీవైష్ణవ మత సంప్రదాయం ప్రకారం శ్రీమహా విష్ణువు చేతిలో ఉండే చక్రం చెడును నాశనం చేసి, ఆపదలో ఉన్న వారికి రక్షణనిచ్చే ఆయుధం. ప్రజలు తమ సుఖ సంతోషాల కోసం ఇంటిలో కాని, గుడిలోకాని సుదర్శన హోమాన్ని నిర్వహిస్తారు. ఈ హోమంలో భాగంగా సుదర్శనుని, అతడి భార్య విజయవల్లిని పవిత్ర జలం ఉన్న కుండలోకి ఆహ్వానిస్తూ పూజ చేస్తారు. సుదర్శనుని స్తుతిస్తూ మంత్రాలు పఠి స్తారు. ఈ హోమం పూర్తయ్యే సరికి హోమకర్త సుఖ సంతోషాలతో, ఆరోగ్యం తో తుల తూగుతాడని విశ్వాసం.శ్రీమహావిష్ణువుకు మంచి రోజు లైన బుధవారం, శనివారం వచ్చిన ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులు ఈ హోమం చేయడానికి అను కూలం. నియమ నిష్టలతో ఈ హోమాన్ని చేయాలి. మంత్రాలు చక్కని ఉచ్ఛారణతో పల కాలి. శరీరం, మనసు, మనం చేసే పనులు శుద్ధంగా ఉండాలి. హోమం ఫలితాలు - చెడును నాశనం చేయడం, పాపాలను నిర్మూలించడం, ఆరోగ్యాన్ని పెంపొందించడం, మానసిక స్థయిర్యాన్ని ఇవ్వడం.

11 వ రోజున చేసే ఖర్మ పూజ సామాను

  పూజ సమయం 12.00 noon  తేదీ 10-7-2021 శనివారం  నల్లని నువ్వులు 50 grams, దర్బ  కట్ట 1,  బియ్యము 1packet one kilo,     తమల పాకులు 25, వక్కలు 25,పసుపు 50 gms .,కుంకుమ 50 gms ,ప్లాస్టిక్  గ్లాసులు 3 , ఆవు నెయ్యి  100 grams 7   పాకెట్లు  ,పెరుగు డబ్బాలు 6 చిన్నవి, బియ్యం పిండి 1/2 కిలో, (పిండాలకు),అరటిపండ్లు ఒక 1/2 డజను,  ఆవు పాలు 100 ml, ఆవు మూత్రం 100 ml,ఆవు పేడ కొంచెం ,  కొత్తవి గ్లాసులు 5 ,  ఆవు పేడ కొంచెం, గందం కొంచెము  , తెల్లని వస్త్రము towel 1,మోదుగ ఆకు    విస్తార్లు 10 , దొప్పలు 10, పంచామృతం 200 ml.,రూపాయి బి ళ్ళలు, 15,  ఆచమనం పాత్ర, అరటి పండ్లు 1 డజన్  ,తేనె చిన్న సీసా , తండ్రి గారి ఫోటో కు   పూల మాల, కుల్లా     పూలు 1/4 kilo, తులసి దళాలు , అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, అయ్యగారికి బియ్యం packets  6, ఆకు కూరలు 6 packets  , చింతపండు   6 packets, బెల్లం 6 packets , పెసర పప్పు 6  packets ,ఎండు మిరపకాయలు 6, దోవతి వస్త్రాలు 6, రాగి చ...

వసంత పంచమి తేది 16-2-2021

  మాఘశుద్ధ పంచమినే 'వసంత పంచమి' అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమి తేది 16-2-2021 మంగళవారం నాడు  జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది.  వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు.  ఆరోజున సరస్వతి దేవి ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది.     శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది.   వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి… అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి.  

తిల చతుర్థి నువ్వులతో గణపతి పూజ తేదీ 15-2-2021 సోమవారం

  ఈ మాఘ  మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" తేదీ 15-2-2021 సోమవారం,  దీనిని "తిల చతుర్థి" అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "గణపతి ని " ఉద్దేశించి , నువ్వులతో  పూజ చేస్తారు ! గణపతి ని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. "కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు , సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది.

చొల్లంగి అమావాస్య తేదీ 11-2-2021 గురువారం

  ఉత్తరాయణం ప్రారంభం అయ్యాకా వచ్చే మాసాలలో మొదటిదైన పుష్యమాసం ఆఖరి రోజైన అమావాస్యని ( తేదీ 11-2-2021 గురువారం ) పుష్య బహుళ అమావాస్య అని చొల్లంగి అమావాస్య అని కూడా  అంటారు. ఈ రోజు అమావాస్య శ్రవణా నక్షత్రం కలిసాయి కాబట్టి ఇది మహోదయ అమావాస్య. ఎంతో మహత్తరమైన రోజు. ఈ ప్రత్యేకమైన రోజున ఎంతో  మంది సముద్ర స్నానం  ఆచరిస్తారు. ఎందుకో తెలుసా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పుష్య,మాఘ మాసాల సూర్యకిరణాల్లో  ఆరోగ్యకారకాల మోతాదు ఎక్కువగా ఉంటుందని మన ధార్మిక గ్రంథాలే కాదు ఆయుర్వేద శాస్త్రం  కూడా చెబుతోంది.  ప్రవాహపు నీటిలోనే కాదు సూర్యరశ్మి సోకే నదీజలాలు, బావిలో ఉండే నీరు ఇలా వేటిలో స్నానం చేసినా ఆరోగ్యపరంగా ఎంతో మంచిదంటారు మన పెద్దవాళ్ళు. ఈ అమావాస్య రోజున దేవుని ఎదుట వరిపిండితో చేసిన చలివిడిదీపంలో ఆవునెయ్యి వేసి దీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే కడుపుచలవ అంటారు.  పితృ తరణాలు ఈ రోజు  తప్పకుండా చేయాలి. 

shop puja items

పుసుపు  100  గ్రాములు , కుంకుమ  100  గ్రాములు , శ్రీ గందం 1  చిన్న డబ్బా బియ్యం 2 కిలోలు , రాగి చెంబులు 1 స్వీట్ బాక్స్ ,  కిలో , పూలు , 1/2  కిలో , పూల దండలు , 1  కొబ్బరి కాయలు 2 , ఆవు పంచితం ,                                నెయ్యి దీపాలు , 2 వత్తులు , పాకెట్,  అగ్గిపెట్టె ,1  తమల పాకులు 25 వక్కలు 1 5, కర్జూరం  5, పసుపు కొమ్ములు 3, అయిదు రకముల పండ్లు , కర్పూరం , 1  ప్యాకెట్ , అగర్బతి ,   ఆవు పాలు ,   100 ml ,   లక్ష్మి ఫోటో  1 బూడిద గుమ్మడి కాయ , 1 రాచ గుమ్మడి కాయ  1 తెల్లని వస్త్రము  1 కనుము బట్ట  1 రూపాయి బిళ్ళలు 1 5, మామిడి కొమ్మ ,  గ్లాసులు 3 , ఆచమనం పాత్ర  1,

మాస శివరాత్రి 10-2-2021 బుధవారం

  ప్రతి నెలలోను వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఈ నెలలో 10-2-2021 బుధవారం నాడు మాస శివరాత్రి వస్తుంది.  శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి. శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరి న కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివే  దన చేయాలి.అభిషేకం ఉదయం 6 గంటలకు శ్రీ రామ లింగేశ్వర ఆలయం, మయూరిమార్గ, బేగంపేట, హైదరాబాద్ లో  ప్రారంభ0 అవుతుంది. 

జన్మ నక్షత్రం వృక్షాలు వాటి ఫలితములు

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. మరికొందరు చెట్లని పెంచడం లో వాటిని కాపాడడం లో ఎంతో ఆసక్తి ని చూపుతుంటారు, తెలిసో తెలియకో వారు, వారి నక్షత్రాలకి సంబందించిన చెట్లని పెంచడం వలన, ఆరోగ్య, ఆర్దిక మరియు ఎన్నో అంశాలను చక్కగా ఆనందిస్తుంటారు. దీన్ని తెలుసుకొని వారికి సంబందించిన వృక్షాల/చెట్లు ను పెంచడం ద్వారా, వృక్షాలు/చెట్లలో దాగిన గొప్ప శక్తుల వలన , ఆరోగ్య, ఆర్దిక పరిస్థితులను మెరుగు పరుచుకోవడమే కాకుండా ,అనుకోని సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఉపకరిస్తాయి . మరియు ఇతరులకు వారికి సంబందించిన వృక్షాలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా, వారు అబివృద్ది చెందడమే గాక పర్యావరణాన్ని కూడా ఎంతో మేలుచేసిన వారవుతారు. భారతీయ సంస్కృతి లో పూజించడానికి అర్హతగలిగినవేన్నో ఉన్నాయి. ప్రతి సంస్కృతీ లోను వారి నమ్మకాలని బట్టి వాటిని ఆచరిస్తుంటారు . వాటిలో ముఖ్యమైనవి చెట్లు. చెట్ల వలన ఉపయోగాలని ప...

విజయ ఏకాదశి 9-3-2021 మంగళ వారం మహాత్యం

ఏకాదశి. ఈ రోజు ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా  ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది పేలాలలో బెల్లాన్ని,  యాలకు లను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని  ప్రసాదం  కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. హేమంత ఋతువు   ముగిసి వసంత   ఋతువు  ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక,  వ్యాధి నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. 

తద్దినం పూజ సామాను

  భగవత్గీత లో పురుశోత్తమ యోగం చడువుకున్నతరువాత ఆబ్దికం  ప్రారంబించాలి.   నల్లని నువ్వులు 50 గ్రాములు,  దర్భ కట్ట,  బియ్యం పిండి ౧/2 కిలో , విస్తార్లు, 6, దొప్పలు 5, ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, బెల్లం అన్ని కలిపి 1/2 లీటరు,  అరటి పండ్లు 1/2  డజను , తమల పాకులు 25 , వక్కలు 15, రూపాయి బిళ్ళలు 11, పసుపు 50 గ్రాములు , గంధం,  విడి పూలు,  ఫోటో కి పూల దండ, కొంచెం తులసి , దీపం, అగర్బతి, కర్పూరం,  ఆచమనం పాత్ర, ౧,  రాగి చెంబు కలశం,  ఆవు పంచితం, ఆవు పెడ,  బ్రాహ్మడికి స్వయం పాకం బియ్యం, కూరగాయలు, మిరపకాయలు, చింతపండు, ఆవు నెయ్యి ప్యాకెట్, పెరుగు ప్యాకెట్,  పెసర పప్పు, దుంపలు,  దోవతి, సెల్ల, వగైరా.  గ్లాసులు 3 పున్యహవాచనం చేయడానికి  ఉతికి ఆరేసిన దోతి కట్టుకోవాలి.  బ్రాహ్మణ దక్షిణ Rs.1 ,516/-