Skip to main content

తిరుప్పావై అయిదవ పాశురం తాత్పర్యం

 మాయనై మన్ను, వడమదురై మైన్దనై

త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై

ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై

త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై

తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు

వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క

పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్

తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్


భావము :

       మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను, చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగ జన్మించాడు. భాగత్సంబంధము ఎడతెగనట్టి మధురకు మధురకు ప్రభువే. యమునా నదీతీరమందున్న గొల్ల కులమున జన్మించి, ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమొనర్చిన దామోదారుడు.    

      వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి, మనము ఇతరములైన కోరికలేవీ కోరక, పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి, నమస్కరించి, నోరార అతని కల్యాణ గుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన -సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్ని అగ్నిలో పడిన దూదివలె భస్మమై పోయేవే! కావున స్వామియొక్క తిరునామములను స్మరింపుము.

Lord Krishna has many surprising qualities and antics. He was born as an administrator of Uttara Mathura. Bhagatsambandha is the Lord of Mathura and Mathura. He was born in the Golla caste on the banks of the river Yamuna and enlightened that caste. The ruby ​​lamp of Gollakula is Damodaru, who illuminated the womb of mother Yashoda.

      Joining Lord Krishna as a Vratakaran, we desire no other desires, offering flowers to the Lord with pure minds, bowing down, chanting his auspicious qualities, meditating on the accumulated sins,

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.