Skip to main content

13 వ పాశుర0 తెలుగు & ఇంగ్షీషు & హిందీ లో తాత్పర్యం

 పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,

క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,

ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్కళమ్బుక్కార్,

వెళ్ళియెళున్దు వియాళముఱజ్గిత్తు,

పుళ్ళుమ్ శిలుమ్బివ గాణ్ పోదరి క్కణ్ణినాయ్,

కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,

పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్,

కళ్ళమ్ తవిర్ న్ధు కలన్దేలో రేమ్బావాయ్.

 కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కల్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషముననుభవింపగోరు గోపికలందరును సంకేతస్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను బృహస్పతి అస్తమించెను. ఇవిగో! పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి' అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరి చూచింది, ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా! నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీ కృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు యీ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా! ఇంకను పరుండరాదు. మనము నోచే యీ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు యీ వ్రతము సాంగోపాంగముగ పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును' అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు.

The gopikaas and gopis team  joined the sacred place to experience the combination of Lord Krishna, who tore open the mouth of Bakasura a demon sent by Kamsa a king, and Lord Rama, who swallowed the ten heads of the evil Ravana. You did not wake up. Indicating that it is white, Venus star on the sky beckoned and Jupiter planet  set. Behold! All the birds are screaming and flying in the sky in search of food,' said the gopikaas, and the sleeping gopika opened her eyes.Do you have eyes like fireflies fallen on the lotus flowers that were charmed by the beauty of her eyes! Let's get up now! Don't be under the illusion that Lord Krishna Swamy himself will come to you after being impressed by the beauty of your eyes. Let's bathe together with everyone in this cold water to quench the thirst of Lord Krishna! Do not rush further. This is an auspicious time, a good time for this fast we observe. Oh beautiful! Let go of your hypocrisy and come together in our party and help us to complete this vow. Andal Godaa  says that everything will be good.The Godadevas are awakening the eighth gopika.today while chanting 13th paashuram today. 
गोपियाँ और गोपियाँ भगवान कृष्ण के संयोजन का अनुभव करने के लिए पवित्र स्थान में शामिल हुईं, जिन्होंने कंस द्वारा भेजे गए बकासुर का मुँह खोला, और भगवान राम, जिन्होंने दुष्ट रावण के दस सिर निगल लिए थे। आप नहीं जागे। यह इंगित करते हुए कि यह सफेद है, शुक्र ने इशारा किया और बृहस्पति अस्त हो गया। निहारना! सभी पक्षी चिल्ला रहे हैं और भोजन की तलाश में आकाश में उड़ रहे हैं, 'गोपियों ने कहा, और सो रही गोपिका ने अपनी आँखें खोलीं और देखा,क्या आपके पास कमल के फूलों में लिखे जुगनू जैसी आंखें हैं जो उसकी आंखों की सुंदरता से मुग्ध थीं! चलो अब उठो! इस भ्रम में न रहें कि आपकी आंखों की सुंदरता से प्रभावित होकर भगवान कृष्ण स्वामी स्वयं आपके पास आएंगे। आओ सब मिलकर इस ठंडे जल में स्नान करें भगवान कृष्ण की प्यास बुझाने के लिए ! आगे जल्दी मत करो। यह एक शुभ मुहूर्त है, इस व्रत के लिए एक अच्छा मुहूर्त है। ओह सुंदर! अपने पाखंड को छोड़ो और हमारी पार्टी में एक साथ आओ और इस व्रत को पूरा करने में हमारी मदद करो।गोदादेवी आठवीं गोपिका को जगा रहे हैं और कह रहे हैं कि सब कुछ शुभ होगा।

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.