నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్
తాత్పర్యము:
అందరకు నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా లోనికి విడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచే అందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేను మాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము . శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు . దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనకు పోనిమ్ము . అని భవనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.
Save the building of Nandagopu, the leader of all, and release him into Bhavanapalaka asking permission to enter into building. Open the beautiful clocks guarding the arched gate by the gatekeepers. Yesterday, I promised that Gopa Balika will give us an instrument called "Para" to chant the illusory Lord Krishna.We did not come seeking any other purpose. We came with a holy feeling. We have come to sing to awaken Sri Krishna. Swami, do not deny yourself in advance. Open the doors that hold each other tightly with close love and let us in. The gopis begged the rulers of Bhavanadwara.i.e.The building administrators.
Comments
Post a Comment