Skip to main content

పాశురము : 6 ( తిరుప్పావై)

 పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్

వైళ్లైవిళిశజ్గన్ పేరరవమ్ కేట్టిలైయో

పిళ్ళాయ్! ఎళున్దిరాయ్ పేయ్ ములైనఞ్జణ్డు

కళ్లచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి

వెళ్లత్తరవిల్ తుయిలమర్ న్దవిత్తినై

ఉళ్ళత్తు క్కొణ్డు మునివర్ గళుమ్ యోగిగళుమ్

మెళ్ళ వెళున్దు అరియెన్ఱ పేరరవమ్

ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్

లేవకుండటాన్ని గమనించి 'తెల్లవారిందమ్మా! ఇక లేచిరావె!' అని లేపుచున్నారు. వేకువనే మేల్కోన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకొంటూ 'మేతకు పోదాం రండర్రా!' అంటూ  కూస్తూ పోతున్నాయి. అరె! పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన శంఖధ్వనిని నీవు విన లేదా? ఓసీ! పిచ్చిపిల్లా! (భగవద్విషయము నెరుగనిదానా!) లేచి రావమ్మా! ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు యైన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, బుషులు తమ హృదయాలలో నిల్పుకొన్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగ మెల్లగ 'హరీ! హరీ!  అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది. వణికించింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవుమాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మా! ఇదీ నీకు వినబడలేదా! రమ్ము! రమ్ము! మాతో గూడి వ్రతము చేయుము.

Noticing that he didn't get up, he said, Morning Sun rises.  Get up now!' They say that. The birds that woke up early in the morning called each other, 'Let's go to graze!' They are crying. Boo! Didn't you hear the conch sound of that Srimannarayana, the king of the bird king Garuda? OC! Mad child!  Get up and come! Behold, this Lord Krishna, who quenched the poison of the pothanasthanams, who kicked Shakatasura's knuckles with his feet as if he had come to kill him, was comfortably doing yoga on Adisesha in that ocean of milk.Srimannarayana sleeping in Yoganidra. Yogis and Bushes kept that Srimannarayana in their hearts. As if he did not have to worry, slow voicely said 'Hurry! Hurray! The sound of remembering him resonated loudly and touched our hearts. trembled. We all woke up. And you're the only one who doesn't move! Can't you hear this! Come on! Come on! Do the combined vratham  with us.

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,