Skip to main content

Posts

Showing posts from 2023

గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు

 పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు, శ గంధం చిన్న డబ్బా 1, బియ్యం 2 కిలోలు,  thamala పాకులు 50,  వక్కలు 21,  ఖర్జూరం పండ్లు 1 పాకెట్,  విడి పూలు, 1/2 కిలో,  పూల దండాలు 2 మూరలు,  టెంకాయలు 5,  నిమ్మకాయలు 5,  బూడిద గుమ్మడి కాయ 1,  రాచ గుమ్మడి కాయ 1,  పాలు పొంగించటానికి కొత్తది ఇత్తడి గిన్నె ,  ఆవు పాలు, ఆవు పంచితం,  మామిడి కొమ్మ 1,  నవధాన్యాలు 1/2 కిలో,  తెల్లని పంచెలు 2,  రాగి చెంబులు 2,  బ్లౌస్ పీసులు 2,  ఆగరబతి, కర్పూరం, మంగళ హారతి నెయ్యి దీపాలు 2, అగ్గిపెట్టె, 1,  మట్టి కుందులు 2, పెద్ద వత్తి 1, నూనె 1/2 కిలో, దీపానికి  ఇంటి దేవుని ఫోటో  అరటి పండ్లు 1/2 డజన్,  చిల్లర పైసలు 11,  ప్లాస్టిక్ గ్లాసులు 5,  బ్రాహ్మణ దక్షిణ 2,116/-

తిరుప్పాణ్ అల్వార్ తిరు నక్షత్రం తేదీ 28-11-2023 మంగళ వారం

  తిరుప్పాణ్ అల్వార్ లేదా తిరుపనాళ్వార్   హిందూ మతంలో వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా పేరుగాంచిన   దక్షిణ భారతదేశంలోని   పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడు. అళ్వార్ల శ్లోకాలను   నలైరా దివ్య ప్రబంధం   గా సంకలనం చేశారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. 108 దేవాలయాలు   వైష్ణవ దివ్య దేశాలుగా   వర్గీకరించబడ్డాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. తిరుప్పాణాళ్వార్ పన్నెండు అళ్వార్ల క్రమంలో పదకొండవ వాడిగా పరిగణించబడతాడు. హిందూ పురాణం ప్రకారం అతను పానార్ కులానికి చెందిన దంపతులకు జన్మించాడు. తిరుప్పాణాళ్వార్  శ్రీరంగంలోని   రంగనాథస్వామి ఆలయం  లోని ప్రధాన దైవం రంగనాథస్వామికి అనుబంధంగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతను ఆ దైవంలోనే ఐక్యం అయినట్లు నమ్ముతారు.తిరుప్పాణ్ ఆల్వార్ 8 లేదా 9 వ శతాబ్దంలో  శ్రీరంగం  సమీపంలోని అలగపురి అనే చిన్న గ్రామంలో  రోహిణి నక్షత్రం  లో బుధవారం పుర్తుర్మాది సంవత్సరంలో కార్తిగై (నవంబరు-డిసెంబరు) నెలలో జన్మించాడు. పానార్లు సంగీతకారులు, సాం...

క్షీరాబ్ది ద్వాదశి తేదీ 24-11-2023 శుక్రవారం విశేషం

  యన్మూలే సర్వ తీర్థాని యన్మథ్యే సర్వ దేవతాయై యదగ్రే సర్వ వేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్ నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః  24, నవంబర్ 2023 శుక్రవారం  రోజు ఉసిరికొమ్మను విష్ణు స్వరూపంగా భావించి.. లక్ష్మీ స్వరూపమైన తులసికోటలో అలంకరించి లక్ష్మీ నారాయణులు నెలవైఉండే తులసి, ఉసిరికి వివాహం జరుపుతారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడారు. అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి.  అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు క...

నాగుల చవితి వల్ల లాబాలు.

పంటలు ఏపుగా పెరిగే కాలంలో  ‘ కార్తిక శుద్ధ చవితి ’ నాడు మనం  ‘ నాగుల చవితి ’ ని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘ సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని ,  వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం ’  అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి ,  సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే ,  నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి...

నాగ చవితి తేదీ 17-11-2023 శుక్రవారం

  దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి (తేదీ 17-11-2023  )నాడు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు.  కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా నాగుల చవితిని చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ఈ ఏడాది నాగుల చవితిని   ఈ పండుగను ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతంలోనూ జరుపుకుంటారు. నాగదోషం, రాహు-కేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగారాధన చేస్తే అవన్నీ తొలగిపోతాయి.  నాగుల చవితి విశిష్టత >> నాగులచవితి రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. >> ఈ రోజున నాగారాధన చేయడం వల్ల సర్పదోషం తొలగిపోయి.. శుభఫలితాలు కలుగుతాయి. >> మీ జాతకంలో పితృదోషం ఉన్నవారు నాగ పూజ చేయడం మంచిది.  >> ఈ పూజను చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలున్నా, వ్యాధులన్నా, బాధలున్నా దూరమవుతాయి.  >> ఈ చవితిని జరుపుకోవడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి

// జై శ్రీరామ్ //   పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 3  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 45, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 9  , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ), blouse peaces, red & yellow colour 2 nos., dothi,Sella 1 set. అరటి పండ్లు 1 డజన్ & అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 nos. అగర్ రబత్తి ,,, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  ముద్ద కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 రాగి  కలశం చెంబులు 2,   దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1,  రూపాయి  బిళ్ళలు  25.  చిన్నవి అరటి కొమ్మలు 4, పూలు ఒక  కిలో, పూల హారాలు  3  మూరలు , Tulasi maala ఒకటి ,sree satyanarayana swamy దేవుని ఫోటో   ఆచమనం పాత్ర సత్యనారాయణ స్వామి కి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు, కాజు, kissmiss ,బాదాం పొడి,  బెల్లం పొడితో చేయాలి .chalimidi...

భగినీ హస్త బోజనం తేదీ 3-11-2024 aadi వారం

  కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది.దీనికి ఓ కథ కూడా ఉంది ఆ కథ ఏమిటనగా .. సూర్య భగవానునకు సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. 'యమునకు' అన్నయ్య 'యముడు' అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా 'యమీ' అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది.ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమ ధర్మరాజు సోదరి యమునుకు మాట ఇచ్చాడు. అ రోజు తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురు చూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని తనను మన్నించమని 'కార్తీక శుధ్ద విదియ' నాడు తప్పకుండా విందుకు వప్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది. అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు.యమున తన అన్నయ్య నుదుట పవిత్ర...

కార్తీక మాసం లో దానం ప్రత్యేకతలు

  కార్తిక మాసం మొదటి రోజు   నెయ్యి, బంగారం ( Ghee , gold ), దానం చేసి అగ్ని దేవుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది.అలాగే రెండవ రోజు   కలువ పూలు నూనె ( Lily flower oil ) దానం చేసి బ్రహ్మ దేవున్ని పూజిస్తే మన శ్శాంతి కలుగుతుంది.అలాగే మూడవ రోజు   ఉప్పు ( salt ) దానం చేసి పార్వతీ దేవిని పూజిస్తే సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే నాలుగో వ రోజు  పెసర పప్పు ( moong dal ) దానం చేసి గణపయ్యను పూజించాలి.ఐదవ రోజు స్వయంపాకం,విసనకర్ర దానం చేసి ఆదిశేషున్ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఆరవ రోజు చిమ్మిలి దానం చేసి చేస్తే మంచిది.అలాగే  సుబ్రహ్మణ్య స్వామిని ( Lord Subrahmanyam ) పూజించాలి.ఏడవ రోజు పట్టు బట్టలు, గోధుమలు, బంగారం దానం చేసి సూర్యుడిని పూజిస్తే మంచి తేజస్సు, ఆరోగ్యం లభిస్తాయిని పండితులు చెబుతున్నారు.కార్తిక మాసంలో తొమ్మిదవ రోజు యధాశక్తి దానం చేసి పితృదేవతలని పూజించడం పితృతర్పణాలు వదిలితే సంతాన రక్షణ కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో 10వ రోజు గుమ్మడికాయ, స్వయంపాకం దానం చేసి అష్ట దిగ్గజాలను పూజిస్తే యశస్సు ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు ...

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం, 

రమా ఏకాదశి తేదీ 9-11-2023 గురువారం

  ఆశ్వయుజ బహుళ ఏకాదశి  – ‘రమా’ – స్వర్గప్రాప్తి. “ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్” – ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. దీపావళి పండగ ముందు వచ్చేది రమా ఏకాదశి అని అంటారు.  ఉపవాసంనాడు – ఉపవాసః స విఙ్ఞేయః సర్వభోగ వివర్జితః” – పాపకృత్యాలకు దూరంగా ఉండి (చేయక), సకల భోగాలను వదలి, పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట! ఇంద్రియ ప్రకోపాన్ని అణచి, 11 ఇంద్రియాలను (పంచ కర్మేంద్రియ, పంచ ఙ్ఞానేంద్రియ మనస్సులు 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపజేసేదే నిజమైన ఉపవాసం.  

దీపావళి తేదీ 12-11-2023 ఆదివారం లక్ష్మీ పూజ సామగ్రి

 ఈ రోజు ఉదయం మంగళ హారతులు , సాయంత్రం పూజలు   పసుపు 100 గ్రాములు,  కుంకుం 200 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1,,  బియ్యం 3 కిలోలు,  లక్ష్మి ఫోటో, లక్ష్మి విగ్రహం, రూపాయి బిళ్ళలు ,వెండి బిళ్ళలు, బంగారం బిళ్ళ,  ఆవు నెయ్యి 1/2 కిలో, మట్టి ప్రమిదలు, వత్తులు, అగ్గిపెట్టె,  ఆవు పంచితము, ఆవు పేడ, రంగూలి ముగ్గులు,  మల్లె పూలు, కనకామ్బురాలు, పూల మాలలు, కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొకాటి 5, మిట్టాయిలు  కిలో,  ఆవు పాలు, పెరుగు, తేనె, చక్కర, అన్ని కలిపి ఒక లీటరు  గంగా జలం, రాగి చెంబు, ఇత్తడి చెంబు, తెల్లని వస్త్రము, 1, రవిక గుడ్డలు ౩, కంకణ దారము,  ఎండు  కుడుకలు, ౩, యాలకులు, ఇలాయిచి, లవంగాలు 100 గ్రాములు,  మామిడి కొమ్మలు 2 , తమల పాకులు, 100, నల్లని పోక వక్కలు 50, కజూరం 35 , బాదం పలుకులు 200 గ్రాములు, కాజు, kissmiss , అన్నీ కలిపిన dry fruits, కొబారికాయలు ౩,  ఆచమనం పాత్ర, 1  సెట్  అగర్బతి, సాంబ్రాణి పొగ కడ్డీలు,  ముద్ద కర్పూరం  అమ్మవారికి,చీర, జాకెట్టు, అలంకార సామగ్రి, దువ్వెన, కాటుక, బొట్టు బిళ్...

కార్తీక మాసం తేదీ 14-11-2023 మంగళవారం ప్రారంభం. విశేషాలు

  వశిష్టుడు ఇలా చెబుతున్నాడు. ”ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసంలో క్రమం తప్పకుండా రోజూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో… వాడు అశ్వమేథ యాగం చేసినంత పుణ్యం సంపాదిస్తాడు. అలాగే ఎవరైతే కార్తీకమాసమంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో… వారికి కైవల్యం ప్రాప్తిస్త్తుంది. దీంతోపాటు దీపదానం కూడా ఈ నెలలో పుణ్యలోకాలను కలుగజేస్తుంది. దీపదానానికి సంబంధిత వ్యక్తి తనంతట తాను స్వయంగా పత్తిని తీసి, శుభ్రపరిచి, వత్తులు చేయాలి. వరిపిండితో ప్రమిదను చేసి, వత్తులు అందులో వేసి, నేతితో దీపాన్ని వెలిగించాలి. ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శక్తికొలది దక్షిణ సైతం ఇవ్వాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ… కార్తీక మాసం ఆఖరిరోజున వెండితో చేసిన ప్రమిదలో, బంగారంతో వత్తిని చేయించి, ఆవునెయ్యిపోసి దీపం వెలిగించాలి. పిండి దీపాన్ని ప్రతిరోజూ ఏ బ్రాహ్మణుడికి దానం చేస్తున్నారో… వెండి ప్రమిదను సైతం చివరిరోజు అదే బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సకలైశ్వర్యములు పొందడమే కాకుండా, మరణానంతరం మోక్షాన్ని పొందగలరు” అని వివరించారు. దీపదాన సమయంలో కింది స్త్రోత్ర...

వాస్తు హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి వివరాలు

 పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా  బియ్యం 2 కిలోలు, తెల్లని వస్త్రములు 2, ( బంగారు అంచు ఉండాలి ) కనుములు 2, గరిక  పూల దండ, విడిపూలు  అటుకులు 100 గ్రాములు , తెల్లని ఆవాలు 50 గ్రాములు,  హోమం సమీధలు 10 కట్టలు, ఆవు నెయ్యి కిలో నర , హోమం పౌడర్  ఆగరబతి, 1 పాకెట్, కర్పూరం 1 పాకెట్,  మట్టి గిన్నె 1,  రాగి చెంబు 1, కొబ్బరి కాయలు 2,  మామిడి కొమ్మ  ఆవు పంచిత0  హోమం కుండం లేదా ఇటుకలు 21, సన్నని ఇసుక  తమల పాకులు 1 5, వక్కలు 15, ఖర్జూరం  పూర్ణాహుతి పాకెట్  శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి  పసుపు 1 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 5     కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1, దోవతి, ఉత్తరీయం 1 సెట్,  తమల పాకులు100   , అరటి కొమ్మలు చిన్నవి 4,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 1/2 లీ.  టెంకాయలు 8  , తెల్లని వ...

మహార్నవమి పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు,  కుంకుమ 200 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 5 కిలోలు,  దేవత ఫోటోలు, గంట,  దీపం చెమ్మెలు 2, వత్తులు, దీపం నూనె, లేదా ఆవు నెయ్యి 1/2 కిలో,  తమల పాకులు 200, జమ్మి ఆకు,  నల్లని పోక వాక్కలు 50, పసుపు కొమ్ములు 25,  ఖర్జూరం పాకెట్ 2, ఎండు కుడుకలు 5, రాగి చెంబులు 2, ఎర్రని లేదా పసుపు రంగు దోవతి, ఉత్తరీయం 1 సెట్,(చక్కని అంచు ఉండాలి ) చీర జాకెట్ పీస్, 1 సెట్, కనుములు 3, బూడిద గుమ్మడి కాయ, 1  రాచ గుమ్మడి కాయ 1, నవధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో,  సాంబ్రాణి పౌడర్, లేదా మంచి ఆగరబత్తులు, పాకెట్, పంచామృతం (పాలు,పెరుగు,తేనె,ఆవు నెయ్యి, చక్కెర,) అన్నీ కలిపి 1/2 లీటరు, అయిదు రకముల పండ్లు, అరటి పండ్లు 2 డ జన్లు,  కొబ్బరి కాయలు, 5 ,(ఒక్కొక్క యంత్రానికి ఒకటి,) నిమ్మ కాయలు 5,( ఒక్కొక్క యంత్రానికి ఒకటి ) కత్తి, కత్తెర, అగ్గి పెట్టె, 1, ( కంప్యూటరు, పుస్తకాలు, పెన్ను,etc .) విడి  పూలు కిలో, పూల దండలు, 10 మూరలు, మామిడి కొమ్మ లు, 2 ,  ఆవు పంచితం, గంగ జాలం 100 ml ., రూపాయి బిళ్ళలు 35, ముద్ద కర్పూరం పాకెట్, 1,...

మహార్నవమి యంత్ర,తంత్ర పూజ విశేషం

  యంత్రము  అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతామూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తాయి. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి, పరిపూర్ణమైన పంచొపచార పూజ , ప్రక్రియలు,  అమ్మవారికి కుంకుమ పూజ చేయండి!... అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. కాకపోతే ఆ యంత్రమునకు మనము నిర్వర్తించే పూజ ప్రక్రియలపై వాటి ఫలితము ఆధారపడి ఉంటుంది. మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.  యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. ఔషధ ప్రయోగముకు, రాజ్యపాలనముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు,...

श्राद्ध पूजा की सामग्री:

 1.रोली,  2.सिंदूर,  3.छोटी सुपारी ,   4.सूचावल 3 kg.,  5.जनेऊ 1,  6.कपूर,  7.हल्द 10 grams,  8.देसी घी,  9.शहद 100ml,  10.काला तिल 50grams,  11.तुलसी पत्ता  12.पान का पत्ता 21,  13.जौ,  14.गुड़ 1 piece,   15.अगरबत्ती,  16.दही,  17.जौ का आटा 1 kilo,  18.गंगाजल,  19.खजूर 200 grams packet,  20.केला 1 dozen, 21.सफेद फूल,  22.उड़द,  23.गाय का दूध 1/2 litre,  24.घी 200 grams, 25.खीर,  26.स्वांक के चावल,  27.मूंग,  28.गन्ना 29.vegetables atleast 5 varieties 30.brahman dakshina

ఇందిర ఏకాదశి తేదీ 10-10-2023 మంగళ వారం

  తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈ సమయంలో పితృ పక్షాలను జరుపుకుంటారు. ఈ ఏకాదశిని పితృ పక్షాలలో జరుపుకోవడం వల్ల మోక్షానికి మార్గం సులభమవుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి విముక్తి లభించి.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి తిథి నాడు పూజలు చేయాలని పెద్దలు చెబుతారు. ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత.. ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు కచ్చితంగా లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తమ పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈరోజున పూర్వీకులన స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణం సమర్పించే వారికి పితృ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇందిరా ఏకాదశి రోజున ఏం చేయాలి...

పితృ పక్షాలు 18-9-2024 నుండి 2-10-2024వరకు

  పి తృ ఋణాన్ని తీర్చే పర్వం పితృపక్షం. అదే  ‘ మహాలయం ’ గా ప్రసిద్ధి చెందింది. .మహం ఆలం యాత్‌ ఇతి మహాలయం ’  అని వ్యుత్పత్తి. చాలినంత తృప్తిని పితరులు ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన తర్పణాదుల ద్వారా పొందుతారు కనుక దీన్ని  ‘ మహాలయ పక్షం ’  అని చెబుతారు.   ‘‘ అమావస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధాం పితృగణానృణామ్‌- అని గరుడ పురాణం పేర్కొంటోంది. అమావాస్య దినం రాగానే పితృ దేవతలు వాయు రూపంలో తమ వారి ఇళ్ళకు వచ్చి ,  సూర్యాస్తమయం వరకూ ఉండి ,  తమ వారు శ్రాద్ధ కర్మలు నిర్వహించి ,  అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది ,  ఆశీర్వదించి వెళ్తారట! లేకుంటే అసంతృప్తి చెంది ,  శాపనార్ధాలతో నిందించి ,  తిరుగుముఖం పడతారని గరుడ పురాణ వచనం.   మూడు ఋణాలు ప్రతి మానవుడు మూడు విధాలైన ఋణాలతో పుడతాడు. అవి దేవ ఋణం ,  ఋషి ఋణం ,  పితృ ఋణం. ధర్మబద్ధమైన నిత్య నైమిత్తిక కార్యాచరణలతో ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడవుతాడు.  ‘ యజ్ఞేవ దేవేభ్యః ’  అని శాస్త్ర వచనం. క్రతువులు చేయడం ,  చేయించడం ద్వారా దేవగణాలు సంతృప్...

అత్తమ్మ తద్దినం పూజ సామాను

  నల్లని నువ్వులు ౫౦ గ్రాములు, బాదం ఆకులు/ అరటి ఆకులు/విస్తరి ఆకులు 3, దర్బ కట్ట, బియ్యం 5౦ గ్రాములు, గంధం 20 గ్రాములు, అరటి పండ్లు 6 ,తెల్లని దోవతి  వస్త్రం,   తమల పాకులు 15, వక్కలు 11, రూపాయి నాణెములు 11, విడి పూలు, తులసి దళం,  స్వయం పాకం (బియ్యం, కూరగాయలు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, పప్పులు, పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్, etc.) పితృ దేవత లేదా మాత్రు దేవత ఫోటో, దీపం, అగర్బతి, కర్పూరం.

అనంత చతుర్దశి తేదీ సెప్టెంబర్ 28, గురువారం

   ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున అనంత చతుర్ధశిని జరుపుకుంటారు. దీని ప్రకారం ఈ ఏడాది  సెప్టెంబర్ 28  అనంత చతుర్దశిని జరుపుకోబోతున్నాం. హిందూ సాంప్రదాయం లో  అనంత చతుర్దశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు 14 లోకాలను సృష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. హృదయపూర్వకంగా భగవంతుడిని ధ్యానిస్తూ ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉంటారో వారికి అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని.. అన్ని వ్యాధులు నయమవుతాయని విశ్వాసం. అంతేకాదు ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, కుటుంబ సమస్యల నుంచి బయటపడడానికి అనంత చతుర్దశి రోజున ఉపవాసం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అనంత చతుర్దశి పూజా విధానం ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం పూజ గదితో సహా మొత్తం ఇంటిలో గంగాజలంతో శుద్ధి చేయాలి. దీని తరువాత పూజా స్థలంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై పసుపు వస్త్రాన్ని పరచి, విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. దీని తరువాత, ధూపం, దీపం, నైవేద్యం, పరిమళం, చందనం సమర్పించి .. మహావిష్ణువుని పూజించి చివరకు ...

నక్షత్ర శాంతి పూజ సామగ్రి & వివరాలు

పూజ విధానం : -  నవగ్రహ ధాన్యాలు దానం చేయాలి , గోమాతకు గ్రాసం మరియు ప్రదక్షిణలు చేయాలి , శ్రీ వారికి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు అభిషేకం చేయించాలి.  దానాలు : - నవగ్రహ ధాన్యాలు : -  గోధుమ పిండి 1250 గ్రాములు, బియ్యం 2 కిలోలు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, జీలకర్ర 2 00 గ్రాములు.  అభిషేకం, అర్చన:- అభిషేకం పూజ సామగ్రి, : -ఆవు పాలు లీటరు, పెరుగు కిలో, తేనె 250 గ్రాములు, ఆవు నెయ్యి 1/2  కిలో, చక్కెర 1/2 కిలో,కొబ్బరి బోండాం 1, పండ్ల రసాలు. అరటి పండ్లు 1/2 డజన్, సాంబ్రాణి ఆగరబత్తి 1 పాకెట్, పూలు 1/2 కిలో, పూల దండలు, దోవతి సెల్లాలు.  ప్రసాదం నై వేద్యం. బ్రాహ్మణ ఆశీర్వచనం,  బ్రాహ్మణ దక్షిణ 

పరివర్తన ఏకాదశి తేదీ 25-9-2023 సోమవారం

  యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు, భాద్రపద శుద్ధ  ఏకాదశి రోజున  ఎడమ వైపు నుంచి కుడి వైపుకి తిరుగుతాడు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. మిగతా ఏకాదశుల మాదిరిగానే, ఈ ఏకాదశిన ఉపవాస దీక్షను చేపట్టవలసి వుంటుంది. శ్రీమహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించ వలసి వుంటుంది.వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని స్పష్టం చేస్తున్నాయి. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా కూడా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు.  ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవేస్తే కలుగే ఫలం లభిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి.

రాధ అష్టమి తేదీ 23-9-2023 Radha Ashtami

  భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ' రాధాష్టమి ' అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది. Sri Radha Ashtami, , the birthday of Radha, is a major festival celebrated by Lord Krishna devotees. The day celebrates the relationship between Radha and  Krishna  – a unique relationship between god and human (world).