Skip to main content

Posts

Showing posts from 2022

పాశురము : 16 ( తిరుప్పావై ) తెలుగు లో & ఇంగ్షీషు లో తాత్పర్యం

నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్ తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్ వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్ తాత్పర్యము:                     అందరకు నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా లోనికి విడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచే అందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేను మాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము . శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు . దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనకు పోనిమ్ము . అని భవనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు. Save the building of Nandagopu, the le...

పాశురము : 15 ( తిరుప్పావై ) తెలుగు & ఇంగ్షీషు లో తాత్పర్యం

ఎల్లే ఇళజ్గిళియే ఇన్నముఱజ్గదియో శిల్లెన్ఱళై యేన్మిన్ నజ్గైమీర్ పోదరుగిన్ఱేన్ వల్లై యున్ కట్టురైకళ్ పణ్డేయున్ వాయఱితుమ్ వల్లీర్ కళ్ నీజ్గశే, నానేదానాయిడుగ ఒల్లై నీపోదాయ్ ఉనక్కెన్న వేరుడైమై ఎల్లారుమ్ పోన్దారో పోన్దార్ పోన్దెణ్ణిక్కొళ్ వల్లానైకోన్ఱానై మాత్తారై మాత్తళిక్క వల్లానై ,మాయనైప్పాడేలో రెమ్బావాయ్.    ఈ మాలిక సంభాషణ రూపంలో వున్నది - బయటివారు - ఓ లేత చిలుకా! ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే! లోపలి గోపాంగన - పూర్ణులైన పూబోడులారా! ఇదిగో వస్తున్నాను.  బయటివారు - శ్రీఘ్రముగా రావమ్మా!  లోపలి గోపాంగన - అబ్బా! గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలువకండి. వస్తాలే! బయటివారు - ఓ చిన్ని చిలుకా! నీవు చాలా చమత్కారంగా మాటాడుతావు. నీ నేర్పిరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే యెరుగుదుములేమ్మ! లోపలి గోపాంగన - మీరే అట్టి సమర్ధులమ్మా! నేనేమీ కాదులే! ఐనా మీరన్నట్లు నేనట్టిదానినేనేమో! రావలసిన వారందరూ వచ్చిరా? బయటివారు - ఆ అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్కజూడవచ్చు కదా! లోపలి గోపాంగన - వచ్చి నేనేమి చేయవలెనో చెప్పరాదు? బయటివారు - కువలయాపీడమనే కంసుని ...

పెండ్లి పూజ సామగ్రి వివరాలు

                                              // శ్రీ రామ // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  గంధం పొడి 100 గ్రాములు,  బియ్యం 8 కిలోలు  (అన్నీ పూజలకు కలిపి) తమల పాకులు 100  నల్లని పోక వాక్కలు 35, ఖర్జూరం 21, పసుపు కొమ్ములు 11, భాసింగాలు 2 జతలు (ఇద్దరికీ) పెండ్లి బట్టలు , అమ్మాయికి మరియు అబ్బాయికి  పెండ్లి కుమారుడు , పెండ్లి కుమార్తె తల్లి దండ్రులకు బట్టలు, (కన్యాదానం బట్టలు ) కనుము బట్టలు (blouse peaces) 5,  తెల్లని వస్త్రములు 2,(బంగారు అంచు ఉండాలి ) విడి  పూలు కిలో  వధువు వరునికి పూల దండలు, మొత్తం ౪  బటువు ఉంగరము, (పెండ్లి కుమారినికి మామగారు అబ్బాయి కాళ్ళు కడిగి తొడగాలి. ) కాళ్ళకు పారాణి  మంగళ సూత్రాలు, పిల్లకు మట్టెలు, తలంబ్రాలలో నవరత్నాలు, జీలకర్ర బెల్లం, ఎండు కొబ్బరి కుడుకలు 1/2 కిలో  ఆవు పాల పెరుగు, తేనె సీసా  అడ్డు తెర ౧, రూపాయి బిళ్ళలు 25, ఆగరబతులు, 1 పాకెట్, కర్పూరం,1 పాకెట్, మంగళ హారతి (నెయ్...

15. పాశురము :

‘‘ఎల్లే! ఇళంగిళియే ఇన్నమ్‌ ఉరంగుదియో?’’ ‘‘శిల్లెన్రు అళైయేన్‌మిన్‌ నంగైమీర్‌! పోదరుగిన్రేన్‌’’ ‘‘వల్లై, ఉన్‌ కట్టురైగళ్‌! పణ్డే ఉన్‌ వాయ్‌ అరిదుమ్‌!’’ ‘‘వల్లర్‌గళ్‌ నీంగళే నానే తాన్‌ అయిడుగ!’’ ‘‘ఒల్లై నీ పోదాయ్‌ ఉనక్కు ఎన్న వేరు ఉడైయైు!’’ ‘‘ఎలారుమ్‌ పోన్‌దారో?‘‘ పోన్‌దార్‌ పోనుదు ఎణ్ణిక్కొళ్‌; వల్లానై కొన్రానై, మాత్తారై మాత్తు అళిక్క వల్లానై, మాయనై ప్పాడు ఏల్‌ ఓర్‌ ఎంబావాయ్‌’’  

13 వ పాశుర0 తెలుగు & ఇంగ్షీషు & హిందీ లో తాత్పర్యం

 పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై, క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్, ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్కళమ్బుక్కార్, వెళ్ళియెళున్దు వియాళముఱజ్గిత్తు, పుళ్ళుమ్ శిలుమ్బివ గాణ్ పోదరి క్కణ్ణినాయ్, కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే, పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్, కళ్ళమ్ తవిర్ న్ధు కలన్దేలో రేమ్బావాయ్.  కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కల్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషముననుభవింపగోరు గోపికలందరును సంకేతస్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను బృహస్పతి అస్తమించెను. ఇవిగో! పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి' అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరి చూచింది, ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా! నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీ కృష్ణ విరహతాపము...

పాశురము : 11 ( తిరుప్పావై) తెలుగు లో & ఇంగ్లీష్ లో తాత్పర్యం

  కత్తుక్కఱవై క్కణంగళ్ పలకఱన్ధు శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్ కుత్త మొన్ఱిల్లాద కోవలర్ దమ్ పొఱ్కొడియే పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్ శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్ ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్. భావము:                 ఓ గోపాలకుల తిలకమా! ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా! ఓ వనమయూరమా! రమ్ము. నీ సఖులు, బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక, మాటాడక, ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు. అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, పలకక (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానం...

10 వ పాశురం తెలుగులో & ఇంగ్షీషు లో తాత్పర్యం

 నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్! మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్ నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్ పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్! పణ్డోరునాళ్ కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్ తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ఆత్త అనన్దలుడైయాయ్! అరుజ్గలమే! తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్. భావము:              నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! తలుపును తెరువుము, తలుపును తెరువకపోయినను మానెగాని, నోటినైనను తెఱచి పలుకవచ్చునుకదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటె వారి శ్రీ సూక్తులను వినటమే చాల ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి). పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపక రణాలను (పఱై) ఇచ్చునుకద! పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూ...

9 వ పాశురం మరియు తెలుగు & ఇంగ్షీషు లో తాత్పర్యం

 తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్ మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్ మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్ ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో? "మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్! భావము:              నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? 'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమపదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు. In the building bui...

ఎనిమిదవ పాశురం మరియు తాత్పర్యం

  కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్ పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్ ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్. భావము :        తూర్పు తెల్లబడినది. పాల్లిచ్చు గోవులు మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేరును. East side is become white....

పాశురము : 7 తెలుగు లో ఇంగ్షీషు లో తాత్పర్యం

 కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే! కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై పేర్తు వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్ ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్. భావము :         ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! భాగవద్విషయానుభవము నెరిగినదానవు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా... వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యందేనికి? అని 'ఒక...

పాశురము : 6 ( తిరుప్పావై)

 పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్ వైళ్లైవిళిశజ్గన్ పేరరవమ్ కేట్టిలైయో పిళ్ళాయ్! ఎళున్దిరాయ్ పేయ్ ములైనఞ్జణ్డు కళ్లచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి వెళ్లత్తరవిల్ తుయిలమర్ న్దవిత్తినై ఉళ్ళత్తు క్కొణ్డు మునివర్ గళుమ్ యోగిగళుమ్ మెళ్ళ వెళున్దు అరియెన్ఱ పేరరవమ్ ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్ లేవకుండటాన్ని గమనించి 'తెల్లవారిందమ్మా! ఇక లేచిరావె!' అని లేపుచున్నారు. వేకువనే మేల్కోన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకొంటూ 'మేతకు పోదాం రండర్రా!' అంటూ  కూస్తూ పోతున్నాయి. అరె! పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన శంఖధ్వనిని నీవు విన లేదా? ఓసీ! పిచ్చిపిల్లా! (భగవద్విషయము నెరుగనిదానా!) లేచి రావమ్మా! ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు యైన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, బుషులు తమ హృదయాలలో నిల్పుకొన్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగ మెల్లగ 'హరీ! హరీ!  అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పె...

తిరుప్పావై అయిదవ పాశురం తాత్పర్యం

 మాయనై మన్ను, వడమదురై మైన్దనై త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్ తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్ భావము :        మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను, చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగ జన్మించాడు. భాగత్సంబంధము ఎడతెగనట్టి మధురకు మధురకు ప్రభువే. యమునా నదీతీరమందున్న గొల్ల కులమున జన్మించి, ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమొనర్చిన దామోదారుడు.           వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి, మనము ఇతరములైన కోరికలేవీ కోరక, పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి, నమస్కరించి, నోరార అతని కల్యాణ గుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన -సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్ని అగ్నిలో పడిన దూదివలె భస్మమై పోయేవే! కావున స్వామియొక్క తిరునామములను స్మర...

తిరుప్పావై 4 వ పాశురం తాత్పర్యం

 మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట. దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా  వెల్లి పోతుంటే, పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు,పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉందికనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది.దాన్ని మనం చూడగలగాలి, కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి. 

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం పూజ సామగ్రి వివరాలు

                                                   //  జై  శ్రీరామ్ //   పసుపు 1 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 5     కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1, దోవతి, ఉత్తరీయం 1 సెట్,  తమల పాకులు 50   , అరటి కొమ్మలు చిన్నవి 4,  వక్కలు 21, పసుపు కొమ్ములు 11,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 1/2 లీ.  టెంకాయలు 9  , తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున  ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1, ,  రాగి  కలశం చెంబులు 2  , దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  15   పూలు...

తిరుమంగయి ఆళ్వార్ తిరునక్షత్రం తేదీ 6-12-2022 మంగళ వారం

 తిరుమంగై ఆళ్వా ర్ తనియన్: కలయామి కలి ధ్వం సిం కవిం లోకదివాకరం | యస్య గోభిః ప్రకాశాభి రావిధ్యం నిహతం తమః ||  అవతారం: 207 సం|| నళనామ సం|| కార్తీకర్తీమాసం పూర్ణిమర్ణి -కృత్తికాత్తి నక్షత్రం- గురువారం నాడు చోళ దేశములోని తిరుక్కురయూరులో శూద్రవంశంలో శార్గముర్గ అంశగా పరాకాలుడు అవతరించాడు. తిరునామములు: తిరుమంగై ఆళ్వారుగా ప్రసిద్ధి చెం దారు. చరిత్ర: పరకాలుడు సైన్యా ధిపతిగా పనిచేసే వాడు. అతడు కుముదవల్లి అనే రూపవతి అయిన అప్సర స్త్రీ నిస్త్రీ వివాహం ఆడటానికి ప్రతిదినం 1008 భగవతోత్తముత్త లకి తదీయారాధన చేయాలనే ఆమె పెట్టినట్టి షరతుని అంగీకరించి ఆమెను వివాహం ఆడాడు. తన వద్ద ఉన్న సంపధ అయిపోగానే తదీయారాధనకై ఎట్లాం టి ఆటంకం ఏర్పడకూడదని భావించి ఎలాంటి ప్రయోజనానికి వినియోగపడని అసాదువుల ధనాన్ని అపహరించి సాధువులకై వాడేవారు. ఒకసారి అరణ్యం లో పెళ్ళి బృందాన్ని దోచటానికి ప్రయత్నిం చాడు. రంగనాథుడే పెళ్ళికుమారుడై లక్ష్మీదేవితో కూడి పరకాలుడికి దివ్యమంగళ విగ్రహంతో సాక్షాత్కరించాడు. స్వా మి దర్శనమాత్రముననే అతనిలో  సహజంగా ఉన్న కవిత్వం పాటల రూపంలో ప్రవహించి దివ్య ప్రబంధాలు అయ్యాయి. ప్రబంధాలు:పెరియతిరుమొళి...
  MAY 9 ர Thirumangai AzhwAr Having experienced the twin-kshEtrams,  tiruvAli-tirunagari  in the previous article it is time for us to understand the life and exploits of this AzhwAr who was the only one among the  12 AzhwArs to receive a personal benediction from the lord in order to initiate the erstwhile feudal king/warrior/robber baron into a staunch devotee and saint. ThirumangaiyAzhwAr was born in a place called KuRaiyalUr  which is 3 km from tirunagari in what was called AlinADu in Chola kingdom. His given name at birth was nIlan  . He was born in the month of KArthikai under the krittikA star. His father (AlinADAr) was a local military commander serving the Chola Empire. nIlan grew up learning the martial arts such as archery and sword fighting and learnt Thamil and Sanskrit. When his father grew old, the king appointed nIlan as successor to his father as a general besides bestowing the title of king for the territory called tiurmangai after nIlan c...

1. సుప్రభాతపు మేలుకొలుపు పద్యాల అర్థ రూపము.

  తొండరడిప్పొడి ఆళ్వారు రచించిన తిరుప్పళ్లియొజుచ్చి.                            దివ్యమైన మేలుకొలుపు సూర్యుడు తూర్పు దిక్కున ఆకాశపు ఉదయగిరిన అందమైన అరవింద ప్రకాశ తేజోమయుడై వచ్చివున్నాడు. ఉదయకాలపు వెలుతురు చక్కగా రాగా, దట్టమైన చిమ్మ చీకటి అంతా నశించినది. మంచి పరిమళపు సువాసనలు వెదజల్లు రంగురంగుల పువ్వులు అన్నీ వికసించి తియ్యని తేనెతో నిండి పలకరిస్తున్నవి. నీ దర్శనమునకై దేవతలు, రాజులు అందరూ వచ్చి అన్ని వైపులా నిండి వున్నారు. వారు ఎక్కి వచ్చిన ఏనుగుల గుంపు యుక్క ఘీంకార శబ్దములు భేరీ వాయిద్య ధ్వనితో కలిసి శబ్దించు అలల సముద్ర ఘోషవలె అన్ని దిక్కుల ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.   తూర్పు దిక్కు నుండి వీచు చల్లని గాలి పూలతీగలపై నిండివున్న మల్లెలు, మొల్లల పూలవాసనలను గ్రహించి మంచి పరిమళ సువాసనాభరితముగా వీచుచున్నది ఇదిగో. పూలపడకన నిద్రించు హంసజంటలు తెల్లవారుఝామున పడే లే మంచు బిందువులతో తడిసిన తమ చక్కని అందమైన రెక్కలను విదిల్చి నిద్ర లేచినవి. మొసలి యొక్క తెల్లని కోరలకి చిక్కి, విపరీతము...

సంకట హర చతుర్థి తేది : 11-11-2022 శుక్రవారం

   గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే  సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

నాగుల చవితి 29-10-2022 శనివారం

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి (తేదీ 29-10-2022 )నాడు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు.  కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా నాగుల చవితిని చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ఈ ఏడాది నాగుల చవితిని (Nagula Chaviti 2022)  ఈ పండుగను ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతంలోనూ జరుపుకుంటారు. నాగదోషం, రాహు-కేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగారాధన చేస్తే అవన్నీ తొలగిపోతాయి.  నాగుల చవితి విశిష్టత >> నాగులచవితి రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. >> ఈ రోజున నాగారాధన చేయడం వల్ల సర్పదోషం తొలగిపోయి.. శుభఫలితాలు కలుగుతాయి. >> మీ జాతకంలో పితృదోషం ఉన్నవారు నాగ పూజ చేయడం మంచిది.  >> ఈ పూజను చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలున్నా, వ్యాధులన్నా, బాధలున్నా దూరమవుతాయి.  >> ఈ చవితిని జరుపుకోవడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. 

ఆకాశ దీపం ఎందుకు పెడతారు ?

  శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి 'ఆకాశ దీపం'వెళ్లాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ... ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం వుంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు . శివ కేశవు ల తేజస్సు జగత్తుకు అందిస్తుంది. ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే శివ కేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తభం పై నుండి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుంది, ఇవ్వాలి అని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగిస్తూ ''దామోదరమావాహయామి'' అని ''త్రయంబకమావాహయామి'' అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట రెండు...

కుజ/మంగళ దోషం నివారణ మార్గం -ఏది ఎలా ఎప్పుడు చేయాలి?

మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని  నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ.              వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని  అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్న...

దీపావళి పూజ తేదీ 24-10-2022 సోమవారం నాడు పూజ సామగ్రి వివరాలు

 ఉదయం మంగళ హారతులు , సాయంత్రం పూజలు   పసుపు 100 గ్రాములు,  కుంకుం 200 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1,,  బియ్యం 3 కిలోలు,  లక్ష్మి ఫోటో, లక్ష్మి విగ్రహం, రూపాయి బిళ్ళలు ,వెండి బిళ్ళలు, బంగారం బిళ్ళ,  ఆవు నెయ్యి 1/2 కిలో, మట్టి ప్రమిదలు, వత్తులు, అగ్గిపెట్టె,  ఆవు పంచితము, ఆవు పేడ, రంగూలి ముగ్గులు,  మల్లె పూలు, కనకామ్బురాలు, పూల మాలలు, కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొకాటి 5, మిట్టాయిలు  కిలో,  ఆవు పాలు, పెరుగు, తేనె, చక్కర, అన్ని కలిపి ఒక లీటరు  గంగా జలం, రాగి చెంబు, ఇత్తడి చెంబు, తెల్లని వస్త్రము, 1, రవిక గుడ్డలు ౩, కంకణ దారము,  ఎండు  కుడుకలు, ౩, యాలకులు, ఇలాయిచి, లవంగాలు 100 గ్రాములు,  మామిడి కొమ్మలు 2 , తమల పాకులు, 100, నల్లని పోక వక్కలు 50, కజూరం 35 , బాదం పలుకులు 200 గ్రాములు, కాజు, kissmiss , అన్నీ కలిపిన dry fruits, కొబారికాయలు ౩,  ఆచమనం పాత్ర, 1  సెట్  అగర్బతి, సాంబ్రాణి పొగ కడ్డీలు,  ముద్ద కర్పూరం  అమ్మవారికి,చీర, జాకెట్టు, అలంకార సామగ్రి, దువ్వెన, కాటుక, బొట్టు బిళ్ళలు, దు...

దేవి నవరాత్రుల గురించి ..

  దేవీ నవరాత్రులు 26 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమవుతాయి. దుర్గా దేవి వివిధ రూపాలు దేవీ నవరాత్రులలో పూజిస్తారు. అందువల్ల, నవరాత్రులలో ప్రతి రోజు, మాతా దుర్గకు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మ సంతోషంగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి వివిధ అలంకారాలు చేస్తారు. అలాగే అమ్మవారికి కట్టే చీర రంగు కూడా ఒక్కోరోజు ఒక్కోలా ఉంటుంది. ఆభరణాలను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు.

చండీ హోమం విశిష్టత

  ఇహపర సాధనకు  చండీ హోమం  ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన  చండీ  సప్తశతిని పారాయణ చేసి,  హోమం  నిర్వహించడమే  చండీ హోమం . దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో  చండీ  యాగం చేస్తారు. వీటిలో నవ  చండీ  యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. పూజ సామగ్రి వివరాలు  పసుపు = 1/4 కిలో కుంకుమ = 1/4 కిలో తమలపాకులు = 250 వక్కలు = 100 ఎండు ఖర్జురములు  =100 పసుపు కొమ్ములు =100 కర్పూరం = 1 ప్యాకెట్ అగరవత్తులు = 1 ప్యాకెట్ కొబ్బరికాయలు = 5 నల్ల నువ్వులు = 200 గ్రాములు తెల్లనువ్వులు = 200 గ్రాములు తేన = చిన్నసీస పంచదార = 1/4 కిలో మిరియాలు = 100 గ్రాములు పచ్చకర్పూరం = 100 గ్రాములు పచ్చి వక్కలు = 100 గ్రాములు ఆవునెయ్యి = 4 కిలోలు దారపు బంతి = 1 మట్టి మూకుళ్ళు = 3 మినపపప్పు =1/2 కిలో గంధపు పొడి = 1 డబ్బా వరి పేలాలు = 1 కిలో సమిధలు బియ్యం = 5 కిలో బియ్యపిండి = 1/2 కిలో పూర్ణాహుతి సామగ్రి = 1 ప్యాకెట్ పెసలు = 1 కిలో గాజులు , కాటుక ,తిలకం ,అద్దం ,చె...