పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. తిరుప్పాణాళ్వార్ పన్నెండు అళ్వార్ల క్రమంలో పదకొండవ వాడిగా పరిగణించబడతాడు. తిరుప్పాణాళ్వార్ శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం లోని ప్రధాన దైవం రంగనాథస్వామికి అనుబంధంగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతను ఆ దైవంలోనే ఐక్యం అయినట్లు నమ్ముతారు. తిరుప్పాణాళ్వార్ యొక్క పది శ్లోకాలను అమలనాతిపిరన్ అని పిలుస్తారు. అతని రచనలు నాలాయిరం దివ్య ప్రబంధంలోని 4000 చరణాలలో పది శ్లోకాలు. తిరుప్పాణాళ్వార్ రచనలు వైష్ణవ మతం యొక్క తాత్విక, వేదాంత ఆలోచనలకు దోహదపడ్డాయి. తిరుప్పాణాళ్వార్, ఇతర అళ్వార్ర్‌ల శ్లోకాలు రోజువారీ ప్రార్థనలలో భాగంగా దక్షిణ భారతదేశంలోని చాలా విష్ణు దేవాలయాలలో పఠిస్తారు.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com